ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
నేమి సేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
నతని మాయలకు మహాత్ములు విద్వాంసు
లడఁగి మెలఁగుచుందు రంధు లగుచు.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 212