శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర
క్షైకారంభకు, భక్తపాలన కళాసంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్.
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 1