పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవ స్థాన సం
హరణ క్రీడనుఁడై త్రిశక్తి యుతుఁడై యంతర్గత జ్యోతియై
పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్‌ బ్రాపింప రాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్‌.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 58