గురువులు దమకును లోఁబడు
తెరువులు సెప్పెదరు, విష్ణుదివ్యపదవికిం
దెరువులు సెప్పరు చీఁకటిఁ
బరువులు పెట్టంగనేల? బాలకులారా!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 246