సర్వభూతంబులయందు నీశ్వరుండు భగవంతుండాత్మ గలండని
సమ్మానంబు సేయుచుఁ గామ క్రోధ లోభమోహ మద మాత్సర్యంబుల గెలిచి
యింద్రియ వర్గంబును బంధించి భక్తి సేయుచుండ
నీశ్వరుడయిన విష్ణు దేవుని యందలి గతి సిద్ధించు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 239