నరుడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుండంతయున్
వరుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేసె మున్,
హరిభక్తాంఘ్రిపరాగశుద్ధతను లేకాంతుల్, మహాకించనుల్,
పరతత్త్వజ్ఞులు గాని నేరరు, మదిన్ భావింప నీ జ్ఞానమున్
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 218