పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోక భద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి శుకుఁ డనియెడు తన సుతునిచేతఁ
జదివించె నింతయు సకల వేదేతిహాసములలోపల నెల్ల సారమైన
యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి
గంగ నడుమ నిల్చి ఘన విరక్తి
యొదవి మునులతోడ నుపవిష్టుఁడగు పరీ
క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 73