పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి
స్వపరభ్రాంతి సేయక పురుషుండు
యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం
గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచున్.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217