అనంతుం డాద్యుండు హరి సంతసించిన నలభ్యంబెయ్యదియు లేదు,
జనార్థనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పరవశుల మైతిమేని
మనకు దైవవశంబున నకాంక్షితంబై సిద్ధించు ధర్మార్థకామంబులు,
కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల?
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217