త్రిగుణాత్మకంబైన తన దివ్య మాయచేత
నంతర్హితైశ్వరుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి
దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి
నిర్దేశింపందగి వికల్పితుండై యుండు
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217