సర్వ భూతాత్మకుండై, సర్వ దిక్కాలసిద్ధుండై,
బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును,
నభోవాయు కుంభినీ సలిల తేజంబులనియెడు మహాభూతంబులయందును,
భూతవికారంబులయిన ఘటపటాదుల యందును,
గుణసామ్యంబయిన ప్రధానమందును,
గుణవ్యతికరంబయిన మహత్తత్త్వాదియందును,
రజస్తమోగుణంబులయందును,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 217