హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే!
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 215