పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వ కర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించుఁ దఱియైన నొకవేళఁ దలఁగి పోవుఁ,
జెడునేని దేహంబు సెడుఁగాని పురుషుండు సెడఁ డాతనికి నింతసేటు లేదు,
పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని యేకత్వంబు గాన రాదు,
దారువుల వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలి భంగి
నాళలీనమైన నభము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 51