కావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుం డై
పరమ భాగవత ధర్మంబు ననుష్ఠింపవలయు,
దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకురుభంగి
సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం
గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు సేయంజనదు,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213