గృహస్తుండు స్వయంకృత కర్మ బద్ధుండై
శిశ్నోదరాది సుఖంబులఁ బ్రమత్తుండయి
నిజకుటుంబ పోషణ పారవశ్యంబున
విరక్తి మార్గంబుఁ దెలియ నేరక
స్వకీయ పరకీయ భిన్న భావంబున
నంధకారంబునం బ్రవేశించుఁ,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213