ధన, కనక, వస్తు, వాహన, సుందరంబులయిన మందిరంబులను
సుకరంబులైన పశు భృత్య నికరంబులను
వంశ పరంపరాయత్తంబులయిన విత్తంబులను వర్జింపలేక,
సంసారంబు నిర్జించు నుపాయంబు గానక
తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబయిన మందిరంబు జేరి చిక్కువడి
వెడలెడి పాటవంబు చాలక తగులువడు కీటకంబు చందంబున
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213