రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల
ధైర్య వల్లికా లవిత్రంబులయిన కళత్రంబులను,
మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను,
శీలవయోరూపధన్యు లగు కన్యలను,
వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను,
గామిత ఫలప్రదాతలగు భ్రాతలను,
మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను,
సకల సౌజన్య సింధువు లయిన బంధువులను,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213