కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టువడి
దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను
పాశంబులం గట్టువడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె
మధురాయమాణమైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ
బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213