సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణంబయిన
మానుష జన్మంబు దుర్లభంబు. అందు పురుషత్వంబు దుర్గమంబు.
అదియు శతవర్ష పరిమితంబైన జీవితకాలంబున నియతంబై యుండు.
అందు సగమంధకార బంధురంబయి రాత్రి రూపంబున
నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను.
చిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్య కైశోర వయోవిశేషంబుల
వింశతి హాయనంబులు గడచు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 213