కమనీయ భూమిభాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపఱుపు లేల
సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజనభాజనపుంజ మేల
వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్ట దుకూల సంఘంబు లేల
గొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాదసౌధాది పటల మేల
ఫలరసాదులు గురియవే పాదపములు
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 21