మండలములోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 92