విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు
విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 100