ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియా
జప దానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర; ద
చ్చపు భక్తిన్ హరిఁ బుండరీకనయునన్ సర్వాతిశాయిన్ రమా
ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 214