మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు?

నంబుజోదర దివ్య పాదార వింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్తమేరీతి నితరంబుఁ జేర నేర్చు
వినుత గుణశీల మాటలు వేయు నేల?
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 150