సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞానకారణంబు
కలవంటి, దింతియ కాని నిక్కము గాదు, సర్వార్థములు మనస్సంభవములు
స్వప్నజాగరములు సమములు, గుణశూన్యుఁడగు పరమునికి గుణాశ్రయమున
భవవినాశంబులు పాటిల్లి నట్లుండుఁ బట్టి చూచిన లేవు బాలురార!
కడఁగి త్రిగుణాత్మకములైన కర్మములకు
జనకమై వచ్చు నజ్ఞానసముదయమును
ఘనతర జ్ఞానవహ్నిచేఁగాల్చి పుచ్చి
కర్మవిరహితులై హరిఁగనుట మేలు
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 238