జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు
లెవ్వనిచేత నెఱుంగంబడు నతండాత్మయండ్రు,
కుసుమధర్మంబులైన గంధంబులచేత
గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగిం
ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన
బుద్ధిభేదంబుల నాత్మ నెఱుంగందగు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237