పెక్కింటి కూటువ దేహ,
మదియు జంగమస్థావరరూపంబుల రెండు విధంబులయ్యె,
మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై,
మణిగణంబులం జొచ్చియున్న సూత్రంబు చందంబున
నాత్మ యిన్నింటియందునుం జొచ్చి దీపించు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237