మూలప్రకృతియు, మహదహంకారంబులును, బంచతన్మాత్రంబులు,
నివి యెనిమిదియుం బ్రకృతులనియును, రజస్సత్త్వతమంబులు మూడును
బ్రకృతి గుణంబు లనియును, గర్మేంద్రియంబు లయిన వాక్పాణిపాద
పాయూపస్థంబులును జ్ఞానేంద్రియంబులైన శ్రవణనయన రసనా
త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీసలిల తేజోవాయు గగనంబులును
నివి పదాఱును వికారంబులనియును గపిలాది పూర్వాచార్యులచేతఁ
జెప్పంబడియె, సాక్షిత్వంబున నీ యిరువదేడింటిని నాత్మగూడియుండుఁ.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237