వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట
నశ్రాంతహరిభావనారూఢ చిత్తుఁడై యుద్ధతుఁడై పాడు నొక్కచోట
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లే దని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ
బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయహర్షజనితబాష్పసలిల
మిళితపులకుఁడై నిమీలితనేత్రుఁడై
యొక్కచోట నిలిచి యూరకుండు
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 124