మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 46