శారదనీర దేందు ఘనసార పటీర మరాళ మల్లి కా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 8