ఆటపాటలు

ATapATalu - Play & Learn!


తెలుగుభాష:మా తెలుగు తల్లికి  ☑ తేనెల తేటల మాటలతో   ☑ శాతవాహనుల వంశాన 
జానపద గీతాలు:కొండొండోరి సెరువుల కింద 

కొండొండోరి సెరువుల కింద సేసిరి ముగ్గురు యెగసాయం - ఆ సేసిరి ముగ్గురు యెగసాయం
ఓడికి కాడి లేదు - రెండు దూడలేదు

కాడి దూడ లేనెగసాయం పండెను మూడు పంటలు - ఆ పండెను మూడు పంటలు
ఒకటి వడ్లు లేదు - రెండు గడ్డి లేదు

వడ్లు గడ్డి లేని పంట విసాకపట్నం సంతలొ పెడితె - విసాకపట్నం సంతలొ పెడితె
వట్టి సంతే గాని - సంతలొ జనం లేరు

జనం లేని సంతాలొకి వచ్చిరి ముగ్గురు షరాబులు - ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు
ఓరికి కాళ్ళు లేవు - రెండు సేతుల్లేవు

కాళ్ళు సేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు - ఆ తెచ్చిరి మూడు కాసులు
ఒకటి ఒల్ల ఒల్లదు - రెండు సెల్ల సెల్లవు

ఒల్ల సెల్లని కాసులు తీసుకు యిజయనగరం ఊరికిపోతె - యిజయనగరం ఊరికిపోతె
ఒట్టి ఊరే గాని - ఊళ్ళొ జనం లేరు

జనం లేని ఊళ్ళోను ఉండిరి ముగ్గురు కుమ్మర్లు - ఆ ఉండిరి ముగ్గురు కుమ్మర్లు
ఒకడికి తలలేదు - రెండుకి మొలలేదు

తల మొల లేని కుమ్మర్లు సేసిరి మూడు భాండాలు - ఆ సేసిరి మూడు భాండాలు
ఒకటికి అంచులేదు - రెంటికి అడుగు లేదు

అంచు అడుగు లేని భాండాలో ఉంచిరి మూడు గింజలు - ఆ ఉంచిరి మూడు గింజలు
ఒకటి ఉడక ఉడకదు - రెండు మిడక మిడకదు

ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలు - ఆ వచ్చిరి ముగ్గురు సుట్టాలు
ఒకడికి అంగుడు లేదు - రెండు మింగుడు లేదు

అంగుడు మింగుడు లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు - ఆ తెచ్చిరి మూడు సెల్లాలు
ఓటి సుట్టు లేదు - రెండు మద్దె లేదు

దీనిభావము తెలియురా?