ఆటపాటలు

ATapATalu - Play & Learn!


తెలుగుభాష:మా తెలుగు తల్లికి  ☑ తేనెల తేటల మాటలతో   ☑ శాతవాహనుల వంశాన 
జానపద గీతాలు:కొండొండోరి సెరువుల కింద 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ, మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం

జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి