ఆటపాటలు
ATapATalu - Play & Learn!
«తెనుగు
నాటకములు
రాజా పరీక్షిత్ (rajA parIkshit)
గుణసంధి (guNasaMdhi)
పాటలు
తెలుగుభాష:
☑
మా తెలుగు తల్లికి
☑
తేనెల తేటల మాటలతో
☑
శాతవాహనుల వంశాన
జానపద గీతాలు:
☑
కొండొండోరి సెరువుల కింద
▶
↩2s
↪2s
⇤
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకొని యికజీవన యానం చేయుదమా
సాగరమేఖల చుట్టుకొని,
సురగంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకొని,
మన దేవికి ఇవ్వాలి హారతులు
గాంగజటాధర భావనతో,
హిమశైల శిఖరమే నిలబడగా
గల గల పారే నదులన్ని,
ఒక బృందగానమే చేస్తుంటే
ఎందరొ వీరుల త్యాగఫలం,
మన నేటిస్వేచ్ఛకె మూలబలం
వారందరిని తలచుకొని,
మన మానసవీధిని నిలుపుకొని