ఆటపాటలు

ATapATalu - Play & Learn!


తెలుగుభాష:మా తెలుగు తల్లికి  ☑ తేనెల తేటల మాటలతో   ☑ శాతవాహనుల వంశాన 
జానపద గీతాలు:కొండొండోరి సెరువుల కింద 

శాతవాహనుల వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోటుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు ఢిల్లిలో సైతమ్ము పెద్ద గద్దెలనేలి పేరు తెచ్చినవాడు
ఎవడయ్య ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు

మంచిమనసెదురైన మాలలిచ్చేవాడు
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటె డొక్క చీల్చేవాడు
చిక్కులెరుగనివాడు, చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు

పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడప దాటనివాడు
పఙ్చభక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూరకోసమై గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడు వాడు? ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు