శూలములు, కత్తులు, తగిన దుస్తులు, కొమ్ములు, నామములు
ఆత్మశుద్ధి
భటుడు-2
ఆశ్రిత్ పరసు
శూలములు, కత్తులు, తగిన దుస్తులు, కొమ్ములు, నామములు
ఉప్పు కప్పురంబు
భటుడు-3
హర్ష్ దీప్ బొమ్మారెడ్డి
శూలములు, కత్తులు, తగిన దుస్తులు, కొమ్ములు, నామములు
చిత్తశుద్ధి
భటుడు-4
బాలక్రిష్ణ రావులపల్లి
శూలములు, కత్తులు, తగిన దుస్తులు, కొమ్ములు, నామములు
గంగిగోవు
నరుడు-1
సుమేధ బొమ్మినేని
తగిన దుస్తులు
తివిరి ఇసుమున
నరుడు-2
సాన్వి అంధవరపు
తగిన దుస్తులు
వెలఁది, జూదంబు
నరుడు-3
సమన్యు ఈర్న
తగిన దుస్తులు
ఒరులేయవి
గుణేశ్
సుమంత్ జొన్నాదుల
తగిన దుస్తులు, A, O, R - పెద్ద ఇంగ్లీషు అక్షరములు
దేవదూత-1
శ్రీల గంగలకుంట
తగిన దుస్తులు, రెక్కలు, "ఏ", "ఓ', "అర్" - పెద్ద అక్షరములు
దేవదూత-2
సంజిత బండి
తగిన దుస్తులు, రెక్కలు, "ఏ", "ఓ', "అర్" - పెద్ద అక్షరములు
దేవదూత-3
ప్రగ్న్య కోట్ర
తగిన దుస్తులు, రెక్కలు, "ఏ", "ఓ', "అర్" - పెద్ద అక్షరములు
దేవదూత-4
పల్లవి పెరుమాళ్ళ
తగిన దుస్తులు, రెక్కలు, "ఏ", "ఓ', "అర్" - పెద్ద అక్షరములు
గుణసంధి
కథ సంక్షిప్తముగా:
గుణసంధిని పిల్లలకు హాస్య నాటక రూపములో తెలియజేయుట. యముడు ఎటువంటి తప్పులను క్షమించడు. తనలోకమునకు వచ్చిన మానవులు చేసిన తప్పులనన్నింటిని గుచ్చి గుచ్చి అడుగును. కొందరు చాలా గొప్ప చరిత్ర గలిగి యుందురు. మంచి మంచి కథలను, కవితలను, పద్యములను చెప్పి యముని శాంతింప చేయబూనుదురు. కానీ వారికి గల ఆధ్యాత్మిక దోషముల మూలమున వారు శిక్షింపబడుచుండుదురు. చివరకు ఒకడు ఎట్టి గుణ దోషములు లేకుండగా, సద్గుణ శీలుడై యుండి యముని చెంత నిలుచును. కానీ అతడికి వ్యాకరణ దోషముండును. తనపేరు (గుణేశ్) ను కూడా సంధిగా విభజించలేకుండును. యముడు శాంతింపడు. చివరికి వానికి గుణసంధి బోధపడును.
ఆఁ... యముండ
సకల జీవకోటి మృత్యువుకు ఆద్యుండ
పాప పుణ్యములను రేయింబవళ్ళు విశాలనేత్రంబుల నే చూచుచుండ
పాపులను వైతరణీతరంగిణీ పాలు నే జేయుచుండ
జీవుల శోకములను నే లెక్క జేయకుండ
ఉఁ... చిత్రగుప్తా! భూలోకవాసుల గతుల విథుల గణనమున నీవత్యుత్తముండ
మరి ఏదీ ఈ నాటి అజెండ?
ఆఁ... యముండ
చిత్రగుప్తుడు: [తన ఆసనమునుండి లేచి నిలుచును]
ప్రభూ! ఆంగ్ల ప్రభావమున మీ పదజాలము బహు విస్త్రుతమాయెను.
అయినను మీరు జాతి, మత, కుల, లింగ, భాషా భేదములకతీతముగా పాపులను శిక్షించెదరు.
ఈ నాటి జాబితాను చూడగా నరులు బారులు తీరియున్నారు.
ముఖ్యముగా గణయంత్రములను కన్నులకు కట్టుకొని తిరుగుతున్నవారు
- అదే ఈ నాటి పరిభాషలో ఫోనులను మాత్రమే చూచుచూ బ్రతికెడివారు -
అనేకులు వచ్చియున్నారు.
యముడు:
చిత్రగుప్తా! వారి యంత్రములు మనకనవసరం.
వారి మంత్రములేవి [నోటిని చూపుతూ]?
తంత్రములేవి [నుదుటిని చూపుతూ]?
మరి కరముల స్వాతంత్ర్యములేవి [చేతులను చూపుతూ]?
ఇక జాగు చేయక పాపులను ప్రవేశపెట్టుడు.
చిత్రగుప్తుడు:
చిత్తం మహా ప్రభూ!
భటులారా! ఈ నాటి పాపులను ఒక్కొక్కరిని వరుసలో ప్రవేశపెట్టుడు.
అంకము 3. యమలోకం - నరుడు-1 (ఐచ్ఛికము)
[యముడు కూర్చొని యుండును. పరిచారికలు విసనకఱ్ఱలను ఆడించుచుండును.
చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఇదిగో మొదటి పాపిని భటులు కొని వచ్చుచున్నారు.
[నరుడు-1 ని భటులు కొని వచ్చుదురు.]
యముడు:
చిత్రగుప్తా! ఈ నరుని పాపములేమిటి?
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఈ నరునికి బంగారమనిన ఎంతయో మోహము. పూజలు అనేకము చేయును.
ఆరతి పళ్ళెము కూడా బంగారముతో చేయును. దేవుని విగ్రహము కూడా బంగారముతో చేయించెను.
కొన్ని గ్రంథములను మాత్రము చదివెను. కాని జీవితమంతయు ఈ బంగారముకోసమే తపించి ఇంకే ఇతర
సత్కార్యములను చేయకుండెను. ఇటుల తన జీవితమును వ్యర్థముజేసికొనెను.
యముడు: [లేచి నిలుచును.]
ఊఁ... యముండ! ఏరా మానవా? నీవు సంపాదించిన బంగారము నీతో రాలేదేమీరా?
ఆ బంగారముతో నీ జీవితమున ఎవరికైనా సేవచేయవలయునని బుద్ధియును కలుగకుండెనా?
వీనిని మరుగుచున్న నూనె భాండమున పడత్రోయుడు.
నరుడు-1:
[చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి యేదో చెవిలో ఊదును.]
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఈ నరుడు మీకు కొన్ని పద్యములను చెప్పగోరును.
యముడు:
ఏమిటవి? చెప్పుము.
నరుడు-1: [పద్యములను చెప్పును. ఒక ఉదాహరణ పద్యము క్రింద ఇవ్వబడినది:]
తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. [యేనుగు లక్ష్మణకవి, భర్తృహరి సుభాషిత రత్నావళి]
యముడు:
భళిరా నరుడా! నీ ముద్దు పలుకులు నన్ను చలింప జేసినవి.
అయినను, పద్యములు పద్యములే, పాపములు పాపములే!
చిత్రగుప్తా! వీనిని కొనిపోవుడు. నూనె భాండమున పడత్రోయుటే వీనికి తగిన శిక్ష.
[భటులు నరుని కొనిపోవుదురు.]
అంకము 4. యమలోకం - నరుడు-2 (ఐచ్ఛికము)
[యముడు కూర్చొని యుండును. పరిచారికలు విసనకఱ్ఱలను ఆడించుచుండును.
చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఇదిగో ఈతడు రెండవ పాపి.
[నరుడు-2 ని భటులు కొని వచ్చుదురు.]
యముడు:
ఏమిటి వీని పాపములు?
చిత్రగుప్తుడు:
[పుస్తకమును చూసి] ప్రభూ!
నరుడు-2: [చిత్రగుప్తుని మాటలకు అడ్డుపడుతూ, పద్యములను చెప్పుట మొదలు పెట్టును. ఉదాహరణ:]
ఇంత మంచి పలుకులు పలికితివి. మరి వీని పాపములేమిటి చిత్రగుప్తా?
చిత్రగుప్తుడు:
[నరునివైపు చూసి] అయ్యా నరుడా! మా కార్యమును చేసికొననిండు.
[యముని చూసి] ప్రభూ! వీనికి క్రోధము అధికము. ఇతర మతము వారలనిన అస్సలు పడదు.
దాన ధర్మములు అధికముగా చేయును. కానీ ఒక మతపు వారలకే సహాయము చేయును.
రెండవ మతపు వారు భూకంపమున జచ్చినను ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వడు.
యముడు: [లేచి నిలుచును.]
ఊఁ... యముండ.
ఏరా పాపీ! నీ మనసున ఇంత క్రోధము దాచుకొంటివా?
చిత్రగుప్తా! వీనిని వైతరణీ నదియందు భగ భగ మను మంటలలో ఒక మన్వంతరము స్నానమాడించుము.
[భటులు నరుని కొనిపోవుదురు.]
అంకము 5. యమలోకం - నరుడు-3 (ఐచ్ఛికము)
[యముడు కూర్చొని యుండును. పరిచారికలు విసనకఱ్ఱలను ఆడించుచుండును.
చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఇదిగో తరువాతి పాపి వచ్చుచున్నాడు.
[నరుడు-3 ని భటులు కొని వచ్చుదురు.] యముడు:
ఈ నరుని పాపములేమిటి?
చిత్రగుప్తుడు:
[పుస్తకమును చూసి] ప్రభూ!
నరుడు-3: [చిత్రగుప్తుని మాటలకు అడ్డుపడుతూ]
యమధర్మరాజా! నన్ను కాపాడండి. మా తాతగారు కొన్ని మంచి పద్యములను చెప్పమని
కోరారు. నాకు సెల్వివ్వండి.
యముడు:
అటులనేరా అర్భకా! మీ తాతగారి కోరికను నెరవేర్చుకొనుము.
నరుడు-3: [ఒకటి రెండు పద్యములను చెప్పును. ఉదాహరణ:]
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబున కగుఁ దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. [భారతం, శాంతిపర్వం]
యముడు:
ఆహా! మీతాతగారు చాలా ధన్యులురా! ఇటువంటి పలుకులను పలుకమని చెప్పారు. కానీ
యమలోకమున నున్నది నీవురా మానవా! మీ తాతగారు కాదురా!
చిత్రగుప్తా! వీని పాపములేమిటి?
చిత్రగుప్తుడు:
మహా ప్రభూ! ఈ నరుని చేష్టలు చెప్పనలవి కాదు. భూలోకమున ఎందరో నరులు ఆకలితో
అలమటించిపోవుచున్నారు. కానీ ఈ నరుడు మాత్రం తన యింటి నిండా ధనముంచుకొని
ఎవ్వరికీ దానము చేయక, ఆ ధనమునే పూజించుకొనుచుండును.
యముడు:
ఊఁ...
చిత్రగుప్తుడు:
అంతే కాదు ప్రభూ! వంద ఎకరముల భూమిలో ఆకాశమంత ఇల్లు కట్టుకొని, ఒకే ఒక్కడు
ముప్పది ఏండ్లుగా జీవించుచున్నాడు ప్రభూ!
యముడు: [లేచి నిలుచును]
ఊఁ... యముండ. ఏరా లోభీ! నీ "దుర్గుణ విశిష్ట"తతో నన్ను
నిశ్చేష్టుడవు చేయుచుంటివే!
చిత్రగుప్తా! వీనిని శతాధిక బాధలు పెట్టి, యేనుగులతో త్రొక్కించి, తిరిగి భూలోకమునకు
పంపి, పరమ దరిద్రునిగా చేయుము.
చిత్రగుప్తుడు:
అటులనే ప్రభూ!
[భటులు నరుని కొనిపోవుదురు.]
అంకము 6. యమలోకం - గుణేశ్ అను నరుడు, మొదటి భాగం
[యముడు కూర్చొని యుండును. పరిచారికలు విసనకఱ్ఱలను ఆడించుచుండును.
చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
చిత్రగుప్తుడు:
భటులారా! ఆ చివరి పాపిని కొనిరండు.
[యముని వైపు జూచి] ప్రభూ! ఈ నాటికి ఈ నరుడే చివరి పాపి.
[భటులు నరుని కొని వచ్చును]
యముడు:
మానవా! నీ నామధేయమేమి?
గుణేశ్:
నా పేరు గుణేశ్.
యముడు:
ఆహా! సద్గుణ నామధేయము!
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఈతండు చేయని పుణ్య కర్మములు లేవు, చేయని దాన ధర్మాలు లేవు.
కాని ఈతని జీవితమున ఒక చిన్న దోషము కలిగెను.
యముడు:
యేమిటది?
చిత్రగుప్తుడు:
వ్యాకరణ దోషం.
యముడు:
వ్యాకరణ దోషమయిన మనకెందులకు?
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఈతని వ్యాకరణ దోషమువలన గ్రంథములనన్నింటిని తప్పు వ్యాఖ్యానములు చేయుచున్నాడు.
తద్మూలముగా ఇతరులు చెడుత్రోవ పట్టుచున్నారు.
యముడు:
ఏరా మానవా! నీవెచట శిష్యరికం చేసితివి?
గుణేశ్: [నమస్కరించుచూ]
అయ్యా! మా గురువులు చక్కగానే చెప్పారు. కానీ నా చుట్టూ ఆంగ్లమయం, కనుక
నన్ను వదలివేయండి మహాప్రభూ!
యముడు: [లేచి నిలుచును.]
ఊఁ... యముండ... ఏది ఏమైననూ, అపచారము అపచారమే.
చిత్రగుప్తుడు:
ప్రభూ! ఈతడు "మహర్షి" యనగా యేమి చెప్పునో అడుగుము.
యముడు:
ఏరా డింభకా! మహర్షి అను సద్గురు పదమునకు అర్థమేమిటో వివరింపుము.
గుణేశ్:
అయ్యా! మహర్షి అంటే... మాహా హర్షి అని నా అభిప్రాయం. అంటే మహా సంతోషమును పొందువాడు అని
అర్థము. ఇదే విధముగా మా శిష్యులకు బోధించాను. వారు కూడా చాలా ఆనందముగా ఉన్నారు.
చిత్రగుప్తుడు:
ఏరా మానవా! తీపి పదార్థములు తినువాడు సంతోషించును గదా! మరీ చాక్లెట్లు తిన్న ప్రతీ మానవుడు
మహర్షి యగునా?
గుణేశ్:
అవుననే అని నా అభిప్రాయం.
యముడు:
ఊఁ... యముండ! వ్యాకరణము నీ అభిప్రాయముతో ఏర్పడలేదురా మానవా! నీ శిష్యులకునూ ఈ
విధముగా బోధించుచున్నావుగాన, అది మహా పాపము.
అంకము 7. యమలోకం - గుణేశ్ అను నరుడు, రెండవ భాగం
[యముడు నిలిచి యుండును. చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
యముడు:
చిత్రగుప్తా! వీనికి తగిన శిక్ష ఈ వేడి భాండములలో ఒక నూరు వర్షములు వేయించుటయే.
[భటులు గుణేశ్ ని గాలిలోకి ఎత్తి తీసికొని పోబోయెదరు.]
గుణేశ్:
రక్షించండి యమధర్మరాజా! నా పాపములను మన్నించండి. రక్షించండి, రక్షించండి..
యముడు:
ఊఁ...
చిత్రగుప్తుడు: [చిత్రగుప్తుడు గుణేశ్ దగ్గరికి వెళ్ళి పలుకును:]
ఏమిటి రక్షించేది, ఇది యమలోకం! మహర్షి అంటే మహా ఋషి! మహా ఋహి!! తెలిసికో.
గుణేశ్:
అయ్యా! నాకు మా అన్నయ్య చెప్పాడు, నన్ను క్షమించండి, తప్పు తెలిసికొన్నాను. మహర్షి
అంటే మహా ఋషి, మహా హర్షి కానే కాదు.
[భటులు గుణేశ్ ను క్రిందకు దించును] యముడు:
ఎవరు రా మానవా వాడు?
గుణేశ్:
మా అన్నయ్య ప్రభూ!
యముడు:
మీ అన్నయ్య నీకేమగును రా?
గుణేశ్:
మా అన్నయ్య నాకు అన్నయ్యండి.
యముడు:
దీర్ఘముగా ఆలోచించుము రా మానవా!
గుణేశ్:
మా అన్నయ్య నాకు అన్నయ్యే అవుతాడండి.
యముడు:
ఊఁ... యముండ!
[భటులు గుణేశ్ ను పైకెత్తును.] గుణేశ్:
సహోదరుడు, సహోదరుడు. నాకు మా అన్నయ్య సహోదరుడు ప్రభూ! రక్షించండి..
[భటులు గుణేశ్ ను క్రిందకు దించును.] యముడు:
భళీ! ఇప్పుడు సహోదరుడనగా అర్థమేమిటో వివరింపుము.
గుణేశ్:
[భయముతో..] ప్రభూ! సహోదరుడంటే... సహో, దరుడు: దీనిలో సహో అనగా పొరపాటు, దరుడు
అనగా దరువు వేయువాడు - అంటే పొరపాటుగా దరువు వేయువాడు ప్రభూ.
యముడు:
ఊఁ యముండ! డింభకా! సహ ఉదరుడు సహోదరుడగునురా! సరే, నీ సద్గుణములను చూచి, నీకు
ఇతరేతర దుర్గుణములు లేవు కనుక నీకింకొక అవకాశమిచ్చుచుంటిని. గుణసంధిని నేర్చుకొనుము. లేని
యెడల నీకు ఈ నరక శిక్ష తప్పదు.
యముడు:
చిత్రగుప్తా! వీనికి గుణసంధిని గూర్చి తెలియజేయు దేవదూతలను పిలిపింపుము.
చిత్రగుప్తుడు:
చిత్తం మహా ప్రభూ!
[గుణేశ్ వైపు తిరిగి] ఓరీ మానవా! దేవదూతలను ప్రార్థింపుడు,
ఈ నరకమునుండి బయటపడుటకు ఇదే మార్గము.
గుణేశ్:
దేవదూతలారా! నా యందు దయతో ప్రత్యక్షమై, నాకు గుణ సంధిని చెప్పండి.
దేవదూతలారా! నా యందు దయతో ప్రత్యక్షమై, నాకు గుణ సంధిని చెప్పండి.
అంకము 8. యమలోకం - గుణేశ్ అను నరుడు, మూడవ భాగం
[యముడు నిలిచి యుండును. చిత్రగుప్తుడు తన ఆసనమునుండి దిగి నిలిచియుండును.]
దేవదూతలు: [రెక్కలు ఊపుకొంటు]
అ-కారమునకు ఇ, ఉ, ఋ-లు పరమైన ఏ, ఓ, అర్.
అ-కారమునకు ఇ, ఉ, ఋ-లు పరమైన ఏ, ఓ, అర్.
అ-కారమునకు ఇ, ఉ, ఋ-లు పరమైన ఏ, ఓ, అర్.
గుణేశ్:
మహా ప్రభూ! నాకు గుణసంధి అర్థమైంది.
అ-కారమునకు ఇ, ఉ, ఋ-లు పరమైన… అ-కారమునకు ఇ, ఉ, ఋ-లు పరమైన… [తడబడును.]