[నిలబడి] ప్రణామములు గురువర్యా! మీరెరుగనిదేమి? వేదములను విభజించి మానవునికి తగిన కర్మ ధర్మములను బోధించితిని. అయినను నామనస్సెందుకో వ్యాకులత గొనియున్నది.
2.2 కలియుగములోని భక్తుల సందిగ్ధము
[నారదుడు, వ్యాసుడు ఒక ప్రక్కగా కూర్చొనియుండుదురు.
పూజారులు ఒక దేవాలయము ద్వారము దగ్గ్ర నిలబడి భక్తులకు శఠగోపంతో ఆశీర్వదించుచుండును.
రెండవ ద్వారం దగ్గర ఎవ్వరు ఉండరు.]
వ్యాసుడు: భక్తి సముద్రంలో మునిగినట్లున్నారు గురుదేవా!