ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
3.3 పరీక్షిత్తు వేటకేగుట, శమీకునిపై చచ్చిన పామును విసరుట, శాపగ్రస్తుడగుట (ప్రదేశము: శమీకుని కుటీరము దగ్గర)

- పరీక్షిత్తు విల్లు బాణములను పట్టుకొని, అలసిపోయినట్లుండును, బాగా దప్పికగొనినట్లు కనిపించును. నీటికొఱకు వెతుకుచున్నట్లు కనిపించును.

- కోంతసేపయ్యాక ముని కుమారుడైన శృంగి, అతని స్నేహితుడైన గౌరుడు వచ్చును -

శృంగి:మా తండ్రిగారేమిటి? పరమశివునివలే ఉండుట ఏమిటి?

శృంగి: గౌరా, ఏమి చెప్పావు? మెడలో పామా?

- శృంగి కంగారుగా తప్పసులోనున్న తన తండ్రి దగ్గరకు నడచును, గౌరుడు వెంట వెళ్ళును. -

శృంగి:
[కంగారుగా, ఆ పామును ఒక పొడవాటి కర్రతో, అతి కష్టముతో తొలగించుచు]
మరి ఇదే పాము ఒకవేళ బ్రతికియున్నట్లయితే?

శృంగి: ఇంత పాపానికి పాలుపడినవాడు ఎవడైయుంటాడు?

శృంగి:
రాజైన మాత్రాన ఇంత పొగరా? ఇంత గర్వమా? అడవులలో ఎవరికి హాని కలిగించని, శక్తిలేని మనబోటి వారలమీదనా ఈ రాజు శక్తిని ప్రయోగించుట? రాజ్యాలను కొల్లగొట్టి పరుల సొమ్మును తనసొమ్ముగా చేసికొను వారు రాజులు, నిరుపేద బ్రతుకులతో అడవిలో జీవించు వారలము మనము.


శృంగి:
[కోపముతో, అటు ఇటు కొద్దిసేపు తిరిగి, తన తండ్రి గారి కమండలము ను తీసికొని, నీటిని ఒకచేతిలో పోసికొని]
ఇదే నాశాపము. ఈ అఘాయిత్యము ను చేసిన ఆ రాజు, నేటికి ఏడవదినమున ఒక పాము కాటుకు గురై చనిపోవుగాక!

[కమండలమును తండ్రిగారి దగ్గర ఉంఛును.]

3.4 శమీకుడు శృంగిని మందలించుట, రాజు శాపమును తెలిసికొనుట (ప్రదేశము: శమీకుని కుటీరము)
- శమీకుడు మెల్లగా తన సమాధినుండి బయటకు వచ్చి, నిలబడి, మూడు సార్లు గుండ్రముగా తిరిగి,
నలుదిక్కుల నమస్కరించి, తన కమండలమును పట్టుకొని శృంగి, గౌరుడు ఉన్న చోటుకు నడచును.
- శృంగి, గౌరుడు ఆయనను గమనించక సంభాషించుకొనుచుందురు.


శృంగి: తప్పు చేసిన వారిని శిక్షించవలె కదా?


శృంగి: ఎంచక్క శిక్షించవచ్చు. చూడు, నేటికి ఏడవనాట ఆ రాజు మరణించును.


శృంగి: నన్ను క్షమించండి తండ్రీ! శాపమును వెనుకకు తీసికొను శక్తి నాకు లేదు.


- శమీకుడు హరి హరి అంటు అటు ఇటు తిరుగును. శృంగి, గౌరుడు నమస్కరించుచు ఆయన వెంట తిరుగును. -

శృంగి: అలాగే తండ్రీ! (వెళ్ళబోవును)

3.6. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గము తెలుపుట (ప్రదేశము: వనప్రాంతము, యజ్ఞ వాటిక)

- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.


శమీకుడు/మునిబాలకులు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
ఫాలము నేల మోపి, భయభక్తులతోడ నమస్కరించి, భూ
పాల కులోత్తముండు గరపద్మములన్ ముకుళించి, నేడు నా
పాలిటిభాగ్య మెట్టిదియొ, పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకభూషణ! దివ్య భాషణా!