మరి నారదులు వ్యాసభగవానునికి చెప్పిన రహస్యాలన్నీ దీనిలో ఉన్నాయి. అంతటి మహా గ్రంథాన్ని, అంతటి పవిత్ర గ్రంథాన్ని మనుజేశ్వరాధములకివ్వజాలనని గురువుగారు చెప్పారు.
శిష్యుడు-2: ఏమిటి గంగనా?
శిష్యుడు-2: ఏమిటా తొమ్మిది?
శిష్యుడు-2: ఎంత జ్ఞానోదయము గల పద్యము! మరి ఇందాక భగవంతుని పూజించే చేతులే చేతులు అని పొగిడారు కదా గురువుగారు?
శిష్యుడు-2: ఈ పద్యంలో భగవంతుని పూజించనటువంటి చేయి - అది చేయి కాదు, చెట్టుకొమ్మతో చేసిన తెడ్డు అంటారు.
శిష్యుడు-2: దీనిని ప్రహ్లాదునిచే పలికించారు పోతనగారు:
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక
చక్రి చింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే
పాదయుగముతోడి పశువు గాక
శిష్యుడు-2: గురువుగారు దేవాలయానికి వెళ్ళారు కదా, మనం కూడా వెళ్ళొద్దాం పద.