- పరీక్షిత్తు విల్లు బాణములను పట్టుకొని, అలసిపోయినట్లుండును, బాగా దప్పికగొనినట్లు కనిపించును. నీటికొఱకు వెతుకుచున్నట్లు కనిపించును.
పరీక్షిత్తు: [తపస్సు చేసికొనుచున్న మునిని చూసి]
ఓ! నా పలుకులు వినిపించనంత దీర్ఘముగా సమాధిలోనికి వెళ్ళెనా? లేదా అలా నటించుచుండెనా? (కాలు క్రిందకు కోపముతో తన్ని, వెనుదిరిగి పోవుచూ, ఆగి, ఒక చచ్చినపామును ముని మెడకు వ్రేళ్ళాడవేసి) ఆహా! ఇప్పుడు నీవు సాక్షాత్తు ఆ పరమ శివునివలేనున్నావులే! (తిరిగి, మరల కాలిని నేలపై తన్ని, కోపముతో వెడలిపోవుచూ) ముని అట! తపస్సు చేసికొనుచుండెనట! రాజమర్యాదలు లేవట!
3.4 శమీకుడు శృంగిని మందలించుట, రాజు శాపమును తెలిసికొనుట
(ప్రదేశము: శమీకుని కుటీరము) - శమీకుడు మెల్లగా తన సమాధినుండి బయటకు వచ్చి, నిలబడి, మూడు సార్లు గుండ్రముగా తిరిగి,
నలుదిక్కుల నమస్కరించి, తన కమండలమును పట్టుకొని శృంగి, గౌరుడు ఉన్న చోటుకు నడచును.
- శృంగి, గౌరుడు ఆయనను గమనించక సంభాషించుకొనుచుందురు.
శమీకుడు: [ఈ సంభాషణను విని] ఏమిరా! ఎవరిగురించి మీ సంభాషణ? రాజు ఎందుకు మరణించును?
శమీకుడు: [తాత్కాలికముగా చెవులు మూసికొని, పైకి చూసి] పరమేశ్వరా! ఎంత తప్పిదము జరిగినది?
శమీకుడు:
శృంగీ! నిజా, నిజాలు ఏమిటో పూర్తిగా తెలిసికోకుండా, ఆలోచనలేక ఇటువంటి పనులు చేయవచ్చునా? అయినా నామీద వేసినది చచ్చిన పామేకదా? ఆయన ఎటువంటి బాధలో ఉన్నాడో ఏమిటో! రాజు మరణిస్తే రాజ్యం ఏమైపోవును? అధర్మము చెలరేగును. ఎంత ధర్మనిష్టతో పరీక్షిన్మహరాజు రాజ్యాన్ని పరిపాలించుచున్నాడో గ్రహించితివా? హరి హరీ! ఎంత ఘోరము జరిగినది.
శమీకుడు: శృంగీ! నీ శాపమును తక్షణమే వెనుకకు తీసికొనుము నాయనా.
శమీకుడు:
హరి హరి! చూడు నాయనలారా! కొట్టినా తిట్టినా పరమభాగవతులు భరిస్తారే కాని, ప్రతీకారం తీర్చుకోరు. మన రాజు ఒక పరమభాగవతుడు. నీ శాపానికి ఆయన ప్రతీకారం తీర్చుకొనడు. సాధులు ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి కుంగిపోరు. హరి హరి! హరి హరి!
- శమీకుడు హరి హరి అంటు అటు ఇటు తిరుగును. శృంగి, గౌరుడు నమస్కరించుచు ఆయన వెంట తిరుగును. -
శమీకుడు:
నాయనా శృంగీ! నీవు వెంటనే పరీక్షిన్మహరాజు చెంతకేగి, జరిగిన సంగతులను తెలియజేయి.
శమీకుడు:
ఆగు నాయనా ఆగు! శపించిన నీవే ఈ సమాచారమును రాజుకు చేరవేయుట సమంజసముగా లేదు. నాయనా గౌరా!
శమీకుడు:
చూడు నాయనా! ఈ విషయాలన్ని రాజుకు వినిపించి, శృంగి చింతించుచున్నాడని చెప్పుము. జరిగినదానికి మన్నింపు కోరు నాయనా!
- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.
శమీకుడు/మునిబాలకులు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
ఫాలము నేల మోపి, భయభక్తులతోడ నమస్కరించి, భూ
పాల కులోత్తముండు గరపద్మములన్ ముకుళించి, నేడు నా
పాలిటిభాగ్య మెట్టిదియొ, పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకభూషణ! దివ్య భాషణా!
- అందరూ కలిసి ఈ క్రింది భజన పాడెదరు -
హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె
హరె రామ హరె రామ రామ రామ హరె హరె