[నారదుడు, వ్యాసుడు ఒక ప్రక్కగా కూర్చొనియుండుదురు.
పూజారులు ఒక దేవాలయము ద్వారము దగ్గ్ర నిలబడి భక్తులకు శఠగోపంతో ఆశీర్వదించుచుండును.
రెండవ ద్వారం దగ్గర ఎవ్వరు ఉండరు.]
పూజారి-2: ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టవలసిన సమయము ఆసన్నమయినది.
పూజారులు:
["కోరికలు గల వారు/తీర్చుకోవాలనుకున్న వారు" అని ఒక నినాదమును దూరముగానున్న మొదటి ద్వారమునకు తగిలించెదరు.
"కోరికలు లేని వారు/వద్దనుకున్న వారు" అని ఇంకొక నినాదమును వారికి దగ్గరగానున్న రెండవ ద్వారమునకు తగిలించెదరు.]
ఆటు వెళ్తే, మీకోరికలు తీరునేమోగానీ, మోక్షానికి మాత్రం ఎన్ని యుగాలు పట్టునో! మరి ఇంకా చాలా తొక్కిసలాట కూడానూ.
ఇదిగో ఇటు చూడండి. ఈ రెండవ మార్గంగుండా వెళ్తే, మోక్షము ౘాలా సులభతరమవుతుంది.
భక్తులు:
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా!
[అంటూ తోసుకొని, పూజారులను కూడా క్రిందకు త్రోసి మొదటి మార్గం ద్వారా వెళ్తారు.]
పూజారి-2: ఈ భక్తులను ఆ భగవంతుడే కాపాడాలని నాకోరిక.