[నారదుడు, వ్యాసుడు ఒక ప్రక్కగా కూర్చొనియుండుదురు.
పూజారులు ఒక దేవాలయము ద్వారము దగ్గ్ర నిలబడి భక్తులకు శఠగోపంతో ఆశీర్వదించుచుండును.
రెండవ ద్వారం దగ్గర ఎవ్వరు ఉండరు.]
పూజారి-1: పూజారి గారు! నారదులు చెప్పిన విషయమును గ్రహించితిరా?
పూజారులు:
["కోరికలు గల వారు/తీర్చుకోవాలనుకున్న వారు" అని ఒక నినాదమును దూరముగానున్న మొదటి ద్వారమునకు తగిలించెదరు.
"కోరికలు లేని వారు/వద్దనుకున్న వారు" అని ఇంకొక నినాదమును వారికి దగ్గరగానున్న రెండవ ద్వారమునకు తగిలించెదరు.]
పూజారులు: భక్తులారా!
పూజారి-1:
భక్తులారా! మీకొక విన్నపము. కోరికలు తీర్చుకోవాలుకున్నవారు ఈ మొదటి ద్వారం గుండా వెళ్ళండి.
కోరికలు వద్దనుకున్నవారు ఇదిగో ఈ రెండవ ద్వారం గుండా వెళ్ళండి.
భక్తులు:
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా!
[అంటూ తోసుకొని, పూజారులను కూడా క్రిందకు త్రోసి మొదటి మార్గం ద్వారా వెళ్తారు.]
పూజారి-1: [పైకి లేస్తూ] పూజారి గారు! ఇప్పుడు మీకోరికేమిటి?
పూజారి-1:
కర్మలు భవిష్యత్తును నిర్ణయించును గానీ, కోరికలతో భగవంతుని చెంతకేగిన ఈ కోరికల వలయంలో చిక్కుకొంటారేగానీ, మోక్షము కలుగునా?