3.1 పరీక్షిత్తు రాజభవనం - మంత్రి కూర్చొని యుండును.
- పరీక్షిత్తు సింహాసనం మీద నుండి దిగి ఆవేశంతో అటూ ఇటూ కొద్ది క్షణాలపాటు నడిచి, మరల సింహాసనము మీద కూర్చొనును.
పరీక్షిత్తు: [బహుమతినిమ్మని ఒక భటుని చే సైగ చేయును]
పరీక్షిత్తు: [సరేనని తల ఊపును, మంత్రి వెడలిపోవును.]
- పరీక్షిత్తు విల్లు బాణములను పట్టుకొని, అలసిపోయినట్లుండును, బాగా దప్పికగొనినట్లు కనిపించును. నీటికొఱకు వెతుకుచున్నట్లు కనిపించును.
పరీక్షిత్తు:
అరెరే! అడవికి వేటకు వచ్చి దారి తప్పితిని. నాసైన్యము కూడా కానరాదు. తీవ్రమైన దాహము. కనుచూపులో కొలనైనా కనిపించదు. ఇప్పుడు మార్గమేమిటి? అదిగో! ఏదో ఒక మునియాశ్రమము వలెనున్నది.
పరీక్షిత్తు: [ముని ఆశ్రమము వద్దకు వచ్చి] ఎవరది? - [సమాధానము రాదు] పరీక్షిత్తు: ఎవరు లోపల? - [సమాధానము రాదు] పరీక్షిత్తు: ఎవరున్నారు లోపల? [కోపముగా] నేను పరీక్షిత్తును. - [సమాధానము రాదు] పరీక్షిత్తు: (కిరీటమును సవరించుకొనుచు) నేను ఈరాజ్యానికి అధినేతను. - [సమాధానము రాదు]
పరీక్షిత్తు:
ఏమిటీ విడ్డూరము? నారాజ్యం లో అతిథి సత్కారములకు కూడా కరువాయెనా? అదియును గాక నేను రాజును. రారేమీ పూలమాలలతో? ఏవీ పండ్లు, ఫలములు? ఏవీ వినయవిధేయతలు? నేను పిలచినా నా ఆజ్ఞకు ధిక్కారమా? హుం...
- [సమాధానము రాదు]
పరీక్షిత్తు: [తపస్సు చేసికొనుచున్న మునిని చూసి]
ఓ! నా పలుకులు వినిపించనంత దీర్ఘముగా సమాధిలోనికి వెళ్ళెనా? లేదా అలా నటించుచుండెనా? (కాలు క్రిందకు కోపముతో తన్ని, వెనుదిరిగి పోవుచూ, ఆగి, ఒక చచ్చినపామును ముని మెడకు వ్రేళ్ళాడవేసి) ఆహా! ఇప్పుడు నీవు సాక్షాత్తు ఆ పరమ శివునివలేనున్నావులే! (తిరిగి, మరల కాలిని నేలపై తన్ని, కోపముతో వెడలిపోవుచూ) ముని అట! తపస్సు చేసికొనుచుండెనట! రాజమర్యాదలు లేవట!
- పరీక్షిత్తు సింహాసనము దిగి నిలబడి యుండును. మంత్రి నిలబడి యుండును. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఆవేశముతో కనిపించును.
- గౌరుడు నమస్కరించుచు ఒక మూలగా యుండి, నేలవైపు చూచును.
పరీక్షిత్తు:
లేదు మంత్రీ! లేదు. జనమేజయ! వేగిరపడకు. ఒకతప్పును వేరొక తప్పుతో సరిచేయగలమా? ఎంత చిన్న తప్పిదమైనా, నేను చేసినది నేరమే! కష్టాలలో ఉన్నపుడే మనిషి నిజస్వరూపము బయటపడును. ఇన్ని సంవత్సరాలు ధర్మబద్ధముగా పాలించుచున్ననూ, రాజుననే అహంకారము నాలో ఇంకా చావలేదు. మా తాతగారైన ధర్మరాజు చెప్పిన ఒక ముంగిస కథ గుర్తులేదా?
- కొద్ది సేపు అంతా నిశ్శబ్దము -
పరీక్షిత్తు:
జనమేజయ! నేడే నీ పట్టాభిషేకమునకు తయారుకమ్ము. భటులారా! జనమేజయుని పట్టాభిషేకానికి పురోహితులను, బలములను తయారుచెయ్యండి. (కొంచెం ముందుకు నడచును, మంత్రివైపు తిరుగును).
పరీక్షిత్తు:
మంత్రీ! నాకాలము దగ్గరైనది. ఒక మనిషి కి ఏడు రోజులలో మరణము సంభవించునని తెలిసినపుడు, చేయవలసిన కర్తవ్యమేమిటి?
పరీక్షిత్తు: సరే, అలాగే చేయండి, మీరాపనిలో ఉండండి.
పరీక్షిత్తు:
మునిబాలకా! నీవిక వెళ్ళవచ్చు. ఒక మనిషిగా నాకర్తవ్యమును తెలిసికొనుటకు ఇదే నాకు కలిగిన వరముగా భావించెదను. (మునిబాలకుడు వెడలిపోవును.)
పరీక్షిత్తు:
జనమేజయ! ప్రతి మనిషికి మరణము తధ్యము. నేను అదృష్టవంతుడను ఎందుకంటే నేను ఎన్ని రోజులు జీవించెదనో నాకు నిశ్చితంగా తెలిసినది, ఇక నా కర్తవ్యాన్ని తెలుసుకొనవలెను. వెళ్ళు, వెళ్ళి నీ పట్టాభిషేకానికి తయారుగా.
గురుడవు, యోగివిభుడవు. నేడో, రేపో దేహాన్ని విడిచేనాకు ముక్తిమార్గమును తెలుపుము. ఏమి జపించిన, ఏమి తలంచిన, ఏమి చేసిన, ఏమి గావించిన, ఎన్నడు ముక్తి కలుగును?