3.6. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గము తెలుపుట (ప్రదేశము: వనప్రాంతము, యజ్ఞ వాటిక)
- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.
ఒక ముని:
రాజా! వ్యాస భగవానుని కుమారుడు, పదహారేళ్ళ బాలుడు, నక్షత్రాల సమూహములో పూర్ణ చంద్రుడిగా వెలుగునొందుచున్న శుక యోగీంద్రులు, అదిగో, మీ అదృష్ట వశాత్తు ఇటే వచ్చుచున్నారు. మీకు ఉపదేశించుటకు ఆయనకంటే తగినవారు ఇంకెవ్వరు లేరు.
- అందరు లేచి నిలబడును -
పరీక్షిత్తు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుడ వైన నీవు సంస్తుతి సేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య! మానసోత్సవమగుచున్.
- అందరూ కలిసి ఈ క్రింది భజన పాడెదరు -
హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె
హరె రామ హరె రామ రామ రామ హరె హరె