నారాయణ, నారాయణ! వ్యాసా! ఎందుకు నీవిలా చించించు చున్నావు?
నారదుడు:
వ్యాసా! ఎన్ని ధర్మములను నీవు బోధించినను, జుగుప్సితములైన కామ్య కర్మలే ధ్యేయముగా మానవులు జీవింతురు.
అదిగో అటు చూడుము. కలియుగములోని మానవుల కష్టములు నీకు చక్కగా బోధపడును.
******** ఇచ్చట భాగము 2.2 పూర్తిగా నడచును ********
2.2 కలియుగములోని భక్తుల సందిగ్ధము
[నారదుడు, వ్యాసుడు ఒక ప్రక్కగా కూర్చొనియుండుదురు.
పూజారులు ఒక దేవాలయము ద్వారము దగ్గ్ర నిలబడి భక్తులకు శఠగోపంతో ఆశీర్వదించుచుండును.
రెండవ ద్వారం దగ్గర ఎవ్వరు ఉండరు.]
నారదుడు: వ్యాసా చూచితివా, ఆ భక్తులను?
నారదుడు:
నారాయణ, నారాయణ. నిజమేమిటో తెలిసికొందాం. చూడుము. ఇప్పుడు నేనొక చిన్న పరీక్ష పెట్టెదను.
చూచితివా వ్యాసా! కోరికలు లేకుండగా ఎవ్వరు పనిచేయుటలేదు. చివరికి దేవుని సన్నిధిలోనూ కోరికలతో అంధులగుచున్నారు.
కనుక నీవు భగవంతుని లీలలను వర్ణించుచూ, కామ్యకర్మములను విడనాడే మార్గమును చూపుతూ ఒక గ్రంథమును వ్రాయుము.