3.1 పరీక్షిత్తు రాజభవనం - మంత్రి కూర్చొని యుండును.
- పరీక్షిత్తు సింహాసనం మీద నుండి దిగి ఆవేశంతో అటూ ఇటూ కొద్ది క్షణాలపాటు నడిచి, మరల సింహాసనము మీద కూర్చొనును.
మంత్రి:
పరీక్షిన్మహరాజా! కలియుగము గురించి మీకింతటి మనో వ్యాకులము అనవసరమని నా అభిప్రాయము. మీరు మీ తాతగారైన ధర్మరాజు కంటే ఎక్కువగా దానధర్మాలను చేశారు. ఇప్పటికే మూడు అశ్వమేథ యాగాలు కూడా పూర్తిగావించారు. ఇంత ధర్మబద్ధముగా సాగుతున్న మీ పరిపాలనలో ఎటువంటి అధర్మమునకు తావు కలుగదని నేనంటాను. మరి నాకు సెలవిప్పిస్తే... [కొద్దిగా లేవబోయి ఒక భటుని రాకతో మరల కూర్చొనును]
మంత్రి:
చూశారా! నామాటలు అక్షరాలా నిజం. శత్రువులు కూడా మీ ధర్మ పరిపాలనను గుర్తించారంటే, ఇక కలి యుగము గురించి మీకనవసరం. నిశ్చింతగా మీరు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి. కొంచెం ఎండలు మెండుగా ఉన్నా, మానసోల్లాసమునకు వేటకు బయలుదేరండి. నామాటలు నమ్మండి. ఇక నాకు సెలవిప్పిస్తే... [కొద్దిగా లేవబోయి ఇంకొక భటుని రాకతో మరల కూర్చొనును.]
మంత్రి: అయ్యా! ఈ నాట్యమయ్యాక సెలవు తీసుకొంటాను, అనుమతివ్వండి.
మంత్రి: రాజా! నాకిక సెలవిప్పించండి. మరల రేపు కలిసెదను.
- పరీక్షిత్తు సింహాసనము దిగి నిలబడి యుండును. మంత్రి నిలబడి యుండును. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఆవేశముతో కనిపించును.
- గౌరుడు నమస్కరించుచు ఒక మూలగా యుండి, నేలవైపు చూచును.
మంత్రి: రాజా, మీరేమీ పలుకరు. మౌనమే అంగీకారమా?
మంత్రి:
[కొద్దిసేపాగి] రాజా, ఆజ్ఞాపించండి, మన రాజ్యంలోని వేద విభులను, పండితులనందరిని కొనితెచ్చెదము. వారు మీ మనోవ్యాకులమును తప్పక నివారింపగలరు.