ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
3.2 పరీక్షిత్తు - కలి పురుషుల సంవాదము [ప్రదేశము: పరీక్షిత్తు రాజభవనము]

- పరీక్షిత్తు సింహాసమనం దిగి "మంచిసమయము రారా, ఇది మంచిసమయము రారా" అని పాడుకుంటూ, అటూ ఇటూ తిరుగుచుండును.
- కలిపురుషుడు [ప్రవేశించి, గోవును కొట్టుకుంటూ వచ్చుచుండును]


కలి పురుషుడు: నేను కలి పురుషుడను. వీరు నాదారికి అడ్డం వచ్చారు.

- పరీక్షిత్తు కత్తిని తీసి కలిపురుషుని చంపబోవును. కలిపురుషుని కర్ర క్రింద పడిపోవును.

కలి పురుషుడు:
[పరీక్షిత్తు యొక్క పాదాలమీడ వ్రాలి]:
రక్షించండి మహాప్రభు, రక్షించండి. దయచేసి నన్ను చంపకండి.
పరీక్షిత్తు:
[కొంచెం సేపు ఆలోచించి]: సరే, ఎంత శతృవైనా శరణార్థులను చంపడం నా ధర్మము కాదు.
[కలి పురుషుడు లేచి నమస్కారము చేసి నిలబడును.]
కలి పురుషుడు:
మహా ప్రభువులు. ద్వాపరయుగం ముగిసింది, శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చేశారు. ఇక ఇది యుగధర్మం ప్రకారం నాయుగమవుతుంది. మీరు ధర్మ ప్రభువులు. నేను శరణార్థిని. కనీసం మీకు కష్టం లేని ప్రదేశాలలో ఉండుటకైనా అనుమతివ్వండి. మీ పరిపాలనలో మద్యపానములాంటి మత్తుమందులు ఉన్నాయా?


కలి పురుషుడు: జూదం ఉన్నదా?

కలి పురుషుడు: ప్రాణి వధ ఉన్నదా?

కలి పురుషుడు: వ్యభిచారము?


కలి పురుషుడు:
మహారాజా! ఈ నాలుగు మీ రాజ్యంలో లెవ్వంటున్నారు. మరి నేనెలా ఉండగలను. చివరిగా ఒక్క కోరిక


కలి పురుషుడు: కనీసం ధనము లేదా బంగారము ఉన్న చోట కొంచెం తావిస్తే.....

పరీక్షిత్తు [నిర్లక్ష్యంగా]: సరే పో.

కలి పురుషుడు: హమ్మయ్య! బ్రతికించారు. చాలా ధన్యవాదాలు.

కలి పురుషుడు [వెనుదిరిగి, పగలబడి నవ్వుకుంటూ]:
పిచ్చిరాజు, ఆయన కిరీటంలోనే బంగారం ఉంది. ఇకనాకు చోటులేకేం? ఎంత ధర్మపరులైనా, ధనము బంగారము దగ్గరకు రాకుండునా? మరి నా మనుగడకు ఇక తిరుగులేదు. [వెడలిపోవును.]