- పరీక్షిత్తు విల్లు బాణములను పట్టుకొని, అలసిపోయినట్లుండును, బాగా దప్పికగొనినట్లు కనిపించును. నీటికొఱకు వెతుకుచున్నట్లు కనిపించును.
- కోంతసేపయ్యాక ముని కుమారుడైన శృంగి, అతని స్నేహితుడైన గౌరుడు వచ్చును -
గౌరుడు: [శమీకుని చూసి] భలే భలే! శృంగీ, మీ తండ్రిగారు సాక్షాత్తు ఆ పరమశివునివలే ఉన్నారు.
గౌరుడు: [శమీకుని చూసి] ఔనురా శృంగీ! మెడలో ఆపాము, తపస్సులో ఉన్న ఆయన విగ్రహము, ...
గౌరుడు: కంగారు పడకురా! అది చచ్చిన పామువలే యున్నది.
గౌరుడు: ఏముందీ! ఈ పాటికి మీ తండ్రిగారి దేహము శవమై యుండును.
గౌరుడు:
ఏమో! ఇక్కడైతే గుర్రపు డెక్కల జాడలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. మన కుటీరము వైపు నుండి రాజు గారు వెళ్ళటం నేను చూశాను. ఆయన పిలిచి ఉంటారు, మీ తండ్రిగారు సమాధిలో ఉండి పలుకకపోయుంటారు. మరి ఇది ఆయనగారి క్రుత్యమే అయి ఉంటుంది.
3.4 శమీకుడు శృంగిని మందలించుట, రాజు శాపమును తెలిసికొనుట
(ప్రదేశము: శమీకుని కుటీరము) - శమీకుడు మెల్లగా తన సమాధినుండి బయటకు వచ్చి, నిలబడి, మూడు సార్లు గుండ్రముగా తిరిగి,
నలుదిక్కుల నమస్కరించి, తన కమండలమును పట్టుకొని శృంగి, గౌరుడు ఉన్న చోటుకు నడచును.
- శృంగి, గౌరుడు ఆయనను గమనించక సంభాషించుకొనుచుందురు.
గౌరుడు: [శృంగితో] అరే శృంగీ! నీవు తొందరపడినావేమోనని నా సందేహము.
గౌరుడు: నిజమే! కానీ మనము బాలకులం కదా, మరి పెద్దవారిని శిక్షించవచ్చా?
గౌరుడు:
[నమస్కరించి] గురువర్యా! మీరు సమాధిలో ఉండగా, మన రాజు మీ మెడలో ఒక చచ్చిన పామును వేసి వెళ్ళెను. మరి శృంగి అది తెలిసికొని రాజు కు నేటికి ఏడవనాట మరణము సంభవించునని శపించెను.
గౌరుడు: గురువర్యా, సెలవివ్వండి!
గౌరుడు: అలాగే గురువర్యా! సెలవు. (గౌరుడు వెడలిపోవును)
- పరీక్షిత్తు సింహాసనము దిగి నిలబడి యుండును. మంత్రి నిలబడి యుండును. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఆవేశముతో కనిపించును.
- గౌరుడు నమస్కరించుచు ఒక మూలగా యుండి, నేలవైపు చూచును.
- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.
శమీకుడు/మునిబాలకులు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
ఫాలము నేల మోపి, భయభక్తులతోడ నమస్కరించి, భూ
పాల కులోత్తముండు గరపద్మములన్ ముకుళించి, నేడు నా
పాలిటిభాగ్య మెట్టిదియొ, పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకభూషణ! దివ్య భాషణా!