ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6

పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
3.1 పరీక్షిత్తు రాజభవనం
- మంత్రి కూర్చొని యుండును.
- పరీక్షిత్తు సింహాసనం మీద నుండి దిగి ఆవేశంతో అటూ ఇటూ కొద్ది క్షణాలపాటు నడిచి, మరల సింహాసనము మీద కూర్చొనును.

భటుడు 1: [అప్పుడే ప్రవేశించి] పరీక్షిన్మహారాజుకు జయీభవ, దిగ్విజయీ భవ!

భటుడు 1:
మహారాజా! పశ్చిమ దిశగా రాజ్యవిస్తరణ కొరకై దండయాత్రను ప్రకటించిన దిక్భూపతి, దండయాత్రను చాలించి, మీ సాన్నిహిత్యం కొఱకు దూతలను పంపనున్నారు. [పరీక్షిత్తు తల ఊపును, భటుడు వెడలిపోవును.]


3.6. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గము తెలుపుట (ప్రదేశము: వనప్రాంతము, యజ్ఞ వాటిక)

- పరీక్షిత్తు (కిరీటము లేకుండ, సామాన్య వస్త్రములతో) మధ్యలో నిలబడును.
- మంత్రి, జనమేజయుడు (కిరీటము ధరించి, రాజ వస్త్రములు ధరించి), నర్తకి, భటులు ఒకవైపు నిలబడి యుండును.
- కొందరు పండితులు, ముని బాలకులు, మునులు, శమీకుడు వేరొకవైపు కూర్చొని యుండును.


భటుడు-1: [నిలబడి, ఈ క్రింది పోతన పద్యమును పాడును]

సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి
యిల్లాలి విడిచి, బహుబలాళి విడిచి
రాజు హృదయ మిడియె రాజీవనయనుపై
ధనము విడిచి, జడ్డు దనము విడిచి



- అందరూ కలిసి ఈ క్రింది భజన పాడెదరు -

హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె
హరె రామ హరె రామ రామ రామ హరె హరె