ఆటపాటలు

ATapATalu - Play & Learn!

రాజా పరీక్షిత్ (raja parikshith)
ఇల్లు
 ♦ 
నాటకము (pdf, v2.4)
 ♦ 
దృశ్యము:
1.1  |  1.2  |  2.1  |  2.2  |  3.1  |  3.2  |  3.3  |  3.4  |  3.5  |  3.6


3.3 పరీక్షిత్తు వేటకేగుట, శమీకునిపై చచ్చిన పామును విసరుట, శాపగ్రస్తుడగుట (ప్రదేశము: శమీకుని కుటీరము దగ్గర)

- పరీక్షిత్తు విల్లు బాణములను పట్టుకొని, అలసిపోయినట్లుండును, బాగా దప్పికగొనినట్లు కనిపించును. నీటికొఱకు వెతుకుచున్నట్లు కనిపించును.

పరీక్షిత్తు:
అరెరే! అడవికి వేటకు వచ్చి దారి తప్పితిని. నాసైన్యము కూడా కానరాదు. తీవ్రమైన దాహము. కనుచూపులో కొలనైనా కనిపించదు. ఇప్పుడు మార్గమేమిటి? అదిగో! ఏదో ఒక మునియాశ్రమము వలెనున్నది.

పరీక్షిత్తు: [ముని ఆశ్రమము వద్దకు వచ్చి] ఎవరది? - [సమాధానము రాదు]
పరీక్షిత్తు: ఎవరు లోపల? - [సమాధానము రాదు]
పరీక్షిత్తు: ఎవరున్నారు లోపల? [కోపముగా] నేను పరీక్షిత్తును. - [సమాధానము రాదు]
పరీక్షిత్తు: (కిరీటమును సవరించుకొనుచు) నేను ఈరాజ్యానికి అధినేతను. - [సమాధానము రాదు]
పరీక్షిత్తు:
ఏమిటీ విడ్డూరము? నారాజ్యం లో అతిథి సత్కారములకు కూడా కరువాయెనా? అదియును గాక నేను రాజును. రారేమీ పూలమాలలతో? ఏవీ పండ్లు, ఫలములు? ఏవీ వినయవిధేయతలు? నేను పిలచినా నా ఆజ్ఞకు ధిక్కారమా? హుం... - [సమాధానము రాదు]

పరీక్షిత్తు: [తపస్సు చేసికొనుచున్న మునిని చూసి]
ఓ! నా పలుకులు వినిపించనంత దీర్ఘముగా సమాధిలోనికి వెళ్ళెనా? లేదా అలా నటించుచుండెనా? (కాలు క్రిందకు కోపముతో తన్ని, వెనుదిరిగి పోవుచూ, ఆగి, ఒక చచ్చినపామును ముని మెడకు వ్రేళ్ళాడవేసి) ఆహా! ఇప్పుడు నీవు సాక్షాత్తు ఆ పరమ శివునివలేనున్నావులే! (తిరిగి, మరల కాలిని నేలపై తన్ని, కోపముతో వెడలిపోవుచూ) ముని అట! తపస్సు చేసికొనుచుండెనట! రాజమర్యాదలు లేవట!

- కోంతసేపయ్యాక ముని కుమారుడైన శృంగి, అతని స్నేహితుడైన గౌరుడు వచ్చును -

గౌరుడు: [శమీకుని చూసి] భలే భలే! శృంగీ, మీ తండ్రిగారు సాక్షాత్తు ఆ పరమశివునివలే ఉన్నారు.
శృంగి:మా తండ్రిగారేమిటి? పరమశివునివలే ఉండుట ఏమిటి?

గౌరుడు (శమీకుని చూసి): ఔనురా శృంగీ! మెడలో ఆపాము, తపస్సులో ఉన్న ఆయన విగ్రహము, ...
శృంగి: గౌరా, ఏమి చెప్పావు? మెడలో పామా?

- శృంగి కంగారుగా తప్పసులోనున్న తన తండ్రి దగ్గరకు నడచును, గౌరుడు వెంట వెళ్ళును. -

గౌరుడు: కంగారు పడకురా! అది చచ్చిన పామువలే యున్నది.
శృంగి:
[కంగారుగా, ఆ పామును ఒక పొడవాటి కర్రతో, అతి కష్టముతో తొలగించుచు]
మరి ఇదే పాము ఒకవేళ బ్రతికియున్నట్లయితే?
గౌరుడు: ఏముందీ! ఈ పాటికి మీ తండ్రిగారి దేహము శవమై యుండును.
శృంగి: ఇంత పాపానికి పాలుపడినవాడు ఎవడైయుంటాడు?

గౌరుడు:
ఏమో! ఇక్కడైతే గుర్రపు డెక్కల జాడలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. మన కుటీరము వైపు నుండి రాజు గారు వెళ్ళటం నేను చూశాను. ఆయన పిలిచి ఉంటారు, మీ తండ్రిగారు సమాధిలో ఉండి పలుకకపోయుంటారు. మరి ఇది ఆయనగారి క్రుత్యమే అయి ఉంటుంది.

శృంగి:
రాజైన మాత్రాన ఇంత పొగరా? ఇంత గర్వమా? అడవులలో ఎవరికి హాని కలిగించని, శక్తిలేని మనబోటి వారలమీదనా ఈ రాజు శక్తిని ప్రయోగించుట? రాజ్యాలను కొల్లగొట్టి పరుల సొమ్మును తనసొమ్ముగా చేసికొను వారు రాజులు, నిరుపేద బ్రతుకులతో అడవిలో జీవించు వారలము మనము.

శృంగి:
[కోపముతో, అటు ఇటు కొద్దిసేపు తిరిగి, తన తండ్రి గారి కమండలము ను తీసికొని, నీటిని ఒకచేతిలో పోసికొని]
ఇదే నాశాపము. ఈ అఘాయిత్యము ను చేసిన ఆ రాజు, నేటికి ఏడవదినమున ఒక పాము కాటుకు గురై చనిపోవుగాక!
[కమండలమును తండ్రిగారి దగ్గర ఉంఛును.]


పాత్రలు - పాత్రధారులు:
పాత్రపాత్రధారి
పోతనపద్మిని
శిష్యుడు-1హాసిని
శిష్యుడు-2సాకేత్ పో.
నారదుడుసాకేత్ నా.
వ్యాసుడుసంహిత
పరీక్షిత్స్మృతి
మంత్రిరోచన్
భటుడు-1విఖ్యాత్
పూజారి-1మేధ
భటుడు-2రోహిత్
పూజారి-2జూహిత
మునిహర్షదీప్
నర్తకిస్వపంతి
కలిపురుషుడుఅక్షయ
శమీకుడుఅభినవ్
శృంగిమనస్వి
గౌరుడుస్నిగ్ధ
జనమేజయుడునిషిల్
శుకుడుఅక్షయ
భక్తులుదీత్య
హితేంద్ర
జోషిత
కృష్ణ
హర్ష
Joined conference / Posted practice audio? (L) for Live
Name 1/21 1/23 1/24 1/27 1/28 1/30 1/31 2/1(L) 2/3 2/4 2/6(L) 2/7(L)
pOtana Y Y Y Y Y Y
SishyuDu-1 Y Y Y Y Y Y Y Y Y Y Y
SishyuDu-2 Y Y Y Y Y Y Y Y Y Y Y
nAraduDu Y Y
vyAsuDu Y Y Y Y Y Y Y Y
parIkshit Y Y Y Y Y Y Y
maMtri Y Y Y Y Y
bhaTuDu-1 Y Y
pUjAri-1 Y Y Y Y Y Y Y
bhaTuDu-2 Y Y Y
pUjAri-2 Y Y Y Y Y Y Y
muni Y Y
nartaki Y Y Y Y Y
kalipurushuDu Y Y Y Y Y Y
SamIkuDu Y Y Y Y
SRMgi Y Y Y Y Y Y Y
gauruDu Y Y Y Y Y
janamEjayuDu Y Y Y Y Y Y Y
SukuDu Y Y Y Y Y